సాధారణంగా నటీమణులు సోషల్ మీడియాలో తమ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ క్రేజ్ ను పొందుతుంటారు. అయితే పాపులర్ సోషల్ నెట్‌వర్క్ ట్విట్టర్‌లో సౌత్ భామలు కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ తమ హవా కొనసాగిస్తున్నారు. 2019 సంవత్సరం పూర్తి కావొస్తుండడంతో ఈ ఏడాది ట్విట్టర్‌లో టాప్ ట్రెండ్స్‌లో ఉన్న పలువురు ప్రముఖుల పేర్లని ప్రకటించింది ట్విట్టర్ ఇండియా. స్టార్ హీరోలు విజయ్, మహేష్‌లు ఐదు, తొమ్మిది స్థానాలు దక్కించుకోగా, దర్శకుడు అట్లీ పదవ స్ధానంలో నిలిచాడు. ఇక బిగిల్ నిర్మాత అర్చన కలాపతి ఈ లిస్ట్‌లో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. ఇక ఫీమేల్ విషయానికి వస్తే సోనాక్షి సిన్హా తొలి స్థానాన్ని దక్కించుకోగా, రెండో స్థానాన్ని అనుష్క శర్మ పొందింది. అందాల భామలు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్‌లు ఏడు, పదో స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ ఇద్దరు భామలు పలు చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో మేల్ విషయానికి వస్తే తొలి స్థానాన్ని అమితాబ్ దక్కించుకున్నారు. అక్షయ్, సల్మాన్ తర్వాతి స్థానాలలో ఉన్నారు.
These women topped the entertainment charts #ThisHappened2019 pic.twitter.com/sxR7AW9b5y
— Twitter India (@TwitterIndia) 10 December 2019
ఆ స్టార్ హీరో సెట్లోనే నాతో చాలా దారుణంగా వ్యవహరించారు : హీరోయిన్