బోర్డర్-గావాస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో వరణుడు అడ్డంకిగా నిలిచాడు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 7.1 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం పడటంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుత బంతితో ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ వార్నర్‌ను బోల్తా కొట్టించాడు. జట్టు స్కోరు 6 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్‌లో వార్నర్ స్లిప్‌లో పూజారా చేతికి చిక్కాడు. అనంతరం క్రీజులోకి లబుషేన్ వచ్చాడు. ప్రస్తుతం క్రీజులో విల్ పకోస్కీ, లబుషేన్ ఉన్నారు. కాగా… ఈ టెస్ట్ మ్యాచ్‌లో మయాంక్ అగర్వాల్ స్థానంలో రోహిత్ శర్మ తుది జట్టులోకి రాగా… గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో నవదీప్ షైనీని జట్టులోకి తీసుకున్నారు. టెస్టుల్లో ఇండియా తరఫున 299వ ఆటగాడిగా షైనీ ఆరంగ్రేటం చేశాడు. ఇక ఆస్ట్రేలియా తరఫున విల్ పకోవ్‌స్కీ ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో ఆరంగ్రేటం చేశాడు.
previous post
చంద్రబాబు చచ్చిన విషసర్పం..