telugu navyamedia
సినిమా వార్తలు

నేను “గే” కాదు… “మజిలీ” ట్రైలర్ పై వర్మ స్పందన

RGV

శివ నిర్వాణ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం “మజిలీ”. పెళ్ళైన తరువాత ఈ దంపతులిద్దరూ కలిసి నటిస్తున్న మొదటి చిత్రం “మజిలీ” ఏప్రిల్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈవెంట్ లో భాగంగా విక్టరీ వెంకటేష్ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.

ఇక ఈ ట్రైలర్ ను చూసిన వర్మ “ఎఫ్… ” వర్డ్ వాడుతూ ట్రైలర్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ వెంటనే ”అవును నాగచైతన్య, ఇంతకముందు ట్వీట్ చేసేటప్పటికీ నేను నాలుగు పెగ్గుల వోడ్కా తాగాను. కానీ.. ఒకవేళ నేను వోడ్కా తాగుండకపోతే పరిస్థితి వరస్ట్ గా ఉండేది. అసలు విషయం ఏంటంటే.. ట్రైలర్ లో సమంత కంటే నువ్వే బాగా నచ్చావు. నేను ‘గే’ని కాను.. అసలు నిజం ఏంటంటే.. ఆమెను నీకంటే నేనే ఎక్కువగా ప్రేమిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. ఆ తరువాత కాసేపటికే తన ట్వీట్ ను డిలీట్ చేశాడు వర్మ. అయినప్పటికీ వర్మ ట్వీట్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

RGV-Tweet

Related posts