ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల ఇక లేరన్న వార్త యావత్ సినీలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. మహోన్నత ప్రజ్ఞాశాలిని కోల్పోయామని సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పాటలు, ఆ పాటల్లోని సాహిత్య విలువలను గుర్తు చేసుకుంటూ పలువురు నటీనటులు, గాయకులు, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
పరుచూరి గోపాల కృష్ణ..
పాటే శ్వాసగా జీవిస్తూ ,వెండితెరమీద సిరివెన్నెలలు కురిపించిన మా సీతారామశాస్త్రి ఇకలేరు అన్న నిజాన్ని తట్టుకోలేకపోతున్నాము . వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ , వారి ఆత్మకు శాంతి కలగాలని , వారికీ దివ్య లోక ప్రాప్తి కలగాలని కోరుకుంటున్నాము అని పరుచూరి గోపాల కృష్ణ అన్నారు.
ముఖ్యంగా సినీ ప్రపంచానికి ‘సిరివెన్నెల’ను పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్ సిరివెన్నెల లేని లోటు తీరనిదని పేర్కొన్నారు.
(సిరివెన్నెసితారామ శాస్ర్తీ ప్రతీ పాటా ఆణిముత్యమే)
‘పదం ఆయన ఆస్తి…
జ్ఞానంతో ఆయనకు దోస్తీ
ఆయనో పదభవన నిర్మాణ మేస్త్రి
సీతారామ శాస్త్రి..సీతారాముడికి సెలవు’ అంటూ మోహన కృష్ణ అనే అభిమాని సిరివెన్నెలకు నివాళులర్పించారు. (సిరివెన్నెసితారామ శాస్ర్తీ చుక్కల్లారా.. ఎక్కడ ‘మా సిరివెన్నెల’)
“మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ
వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు” – మహానుభావా…చిరస్మరణీయుడా…ఇక కనిపించవా?…మా గుండెల్లో నిద్రపోయావా?…విశ్వాత్మలో కలిసిపోయావా? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దర్శకుడు దేవ కట్ట..
“మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ
వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది
ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు” – మహానుభావా…చిరస్మరణీయుడా…ఇక కనిపించవా?…మా గుండెల్లో నిద్రపోయావా?…విశ్వాత్మలో కలిసిపోయావా? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దర్శకుడు అనిల్ రావుపూడి..
తెలుగు సాహిత్య శిఖరం… సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… 🙏
అజ్ఞానపు చీకటి ని తన అక్షర కిరణాల తో వెన్నెల గా మార్చిన సిరివెన్నెల గారికి….. కన్నీటి వీడ్కోలు …… ,, 😭🙏