telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మోసం చేశారంటూ పోలీసులకు యాంకర్ రవి ఫిర్యాదు… ఎవరంటే…?

Ravi

బుల్లితెర స్టార్ యాంకర్ రవి… సందీప్ అనే వ్యక్తి తన దగ్గర రూ. 45లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యదు చేశారు. 45 లక్షలు అప్పుగా తీసుకున్న సందీప్ కొన్ని రోజుల తర్వాత కొంత డబ్బులు ఇచ్చాడని, అయితే మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడగ్గా బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో రవి చెప్పుకొచ్చాడు. తాను ఎక్కడికెళ్లినా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులను పంపి బెదిరిస్తున్నాడని రవి అందులో వెల్లడించాడు. తన దగ్గర తీసుకున్నట్లే చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్న సందీప్ వారిని కూడా ఇలాగే మోసం చేశాడని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాంకర్ రవి హీరోగా ‘ఇది మా ప్రేమ కథ’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు సందీప్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో విభేదాలు మొదలయ్యాయి. అయితే అంతకుముందు సందీప్ కూడా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో తనను బెదిరిస్తున్నారంటూ యాంకర్ రవిపై ఫిర్యాదు చేయడం గమనార్హం.

Related posts