telugu navyamedia
తెలంగాణ వార్తలు

సికింద్రాబాద్ విధ్వంసం కేసు: సుబ్బారావు శిష్యులు ఏడుగురు అరెస్ట్‌..

*సుబ్బారావుతోపాటు ఏడుగురికి గాంధీలో పరీక్షల నిర్వహణ
*అనంతరం రైల్వే పోలీసులకు అప్పగింత

అగ్నిపథ్ స్కీమ్‌కు వ్య‌తిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జూన్‌ 17న జరిగిన విధ్వంసంలో ప్ర‌ధాన పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆవుల సుబ్బారావు చుట్టూ  ఉచ్చు బిగిస్తుంది.

ఈ అల్లర్ల కేసులో కేసులో మరో ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం రైల్వే పోలీసులకు అప్పగించారు. ఈ ఏడుగురు సుబ్బారావు అనుచరులేనని రైల్వే పోలీసులు ఆధారాలు సేకరించారు.

అంతకుముందు సుబ్బారావుతో సహా ఎనిమిది మందిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రైల్వే పోలీ్‌సస్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించారు.

తాజాగా ఆదుపులోకి తీసుకున్న వారిని కూడా విచారించిన తర్వాత సుబ్బారావును కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సుబ్బారావు నేరం చేశాడని ఆధారాలు లేవు..

సికింద్రాబాద్‌ విధ్వంసం కేసులో ఆవుల సుబ్బారావు ప్రత్యక్షంగా పాల్గొన్నాడనే ఆధారాల్లేవని ఆయన తరఫు న్యాయవాది అన్నారు. శాంతియుతంగా నిరసన తెలపాలనే ఆయన ఆర్మీ అభ్యర్థులకు సూచించాడని తెలిపారు. 17వతేదీ సుబ్బారావు సికింద్రాబాద్‌లో లేడని, బోడుప్పల్‌లోని సాయి డిఫెన్స్‌ అకాడమీలో ఉన్నాడని చెప్పారు. సుబ్బారావు నేరానికి పాల్పడినట్టు ఆధారాలు లేకపోవడం వల్లనే పోలీసులు ఇన్ని రోజులు అదుపులో ఉంచుకున్నారన్నారు.

మ‌రోవైపు కాగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన ఆవుల సుబ్బారావు , తన అనుచరులతో విధ్వంస రచన చేసినట్టు  రైల్వే సిట్ పోలీసులు శుక్రవారం గుర్తించారు .

ఈ క్ర‌మంలో మంగళవారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆవులను ఏపీలో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత రహస్య ప్రదేశంలో మూడు రోజులుగా ఆవులు సుబ్బారావును టాస్క్ ఫోర్స్ పోలీసులు, రైల్వే పోలీసులు విచారించారు.

విచారణ సమయంలో సంచలనాలు బయటికొచ్చాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శాంతియుతంగా ఆందోళన చేయాలని కోరినట్లుగా తొలుత పోలీసుల విచారణలో ఒప్పుకున్నారని సమాచారం.

అయితే పోలీసులు తాము సేకరించిన ఆధారాలను సుబ్బారావు ముందు పెట్టి ప్రశ్నించారు. వ్యూహాంలో భాగంగానే విద్యార్థులను ఆవుల సుబ్బారావు, అతని అనుచరులు రెచ్చగొట్టారని పోలీసులు విచారణలో తేలింది.

సుబ్బారావ్ ఆదేశాల మేరకే తాము విధ్వంసానికి పాల్పడినట్లు కొందరు ఆర్మీ అభ్యర్థులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారని కథనం తెలిపింది.   

కాగా తెలుగు రాష్ట్రాల్లో ఆర్మీ ఉద్యోగార్థులకు శిక్షణ ఇచ్చే సాయి డిఫెన్స్‌ అకాడమీకి రైల్వే పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.

Related posts