telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చైతన్యకు విడాకులు ఇచ్చేయమన్న నెటిజన్… సామ్ ఏమందంటే ?

Sam

స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు పలు రంగాల్లో సత్తా చాటుతోంది. అంతేకాదు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటూ ఆసక్తికరమైన ఎన్నో విషయాలను పంచుకుంటోంది. ఇక ఫాలోయింగ్ పరంగా తన తోటి స్టార్ హీరోయిన్స్ ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతోంది. ఇక టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లిస్టులో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు. పెళ్లయిన తర్వాత కూడా వీరిద్దరు సినిమాలతో బిజీగా ఉన్నారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సమంత ఎప్పుడూ సోషల్ ‌మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తాజా ఫోటోలు పోస్ట్ చేయడంతో పాటు నెటిజన్ల కామెంట్స్‌కు ఫన్నీగా సమాధానాలిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్‌ చేసిన కామెంట్‌కు తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చిన సామ్. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోను పోస్ట్ చేసిన చేసిన సమంత ఫీలింగ్ గుడ్ అంటూ కామెంట్ పెట్టింది. దీనికి నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ‘చై కి విడాకులు ఇచ్చేయ్.. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం’ అంటూ కామెంట్ చేశాడు. దీనికి స్పందించిన సమంత.. ‘కష్టం… ఒక పని చెయ్..చై ని అడుగు’ అంటూ కౌంటర్ చేసింది. సమంత సమాధానానికి ఫిదా అవుతున్నారు నెటిజన్లు.

 

View this post on Instagram

 

☀️

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Related posts