telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లవ్ స్టోరీ : ఆ సీన్ చూసి నా మైండ్ బ్లాంక్.. సమంత

Samantha

సాయిపల్లవి, నాగచైతన్య జంటగా నటిస్తున్న చిత్రం “లవ్ స్టోరీ”. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తెలంగాణ యువకుడిగా క‌నిపించ‌నున్నాడు చైతూ. ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌కి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఏయ్‌పిల్లా మ్యూజిక‌ల్ రివ్యూ అంటూ ఓ వీడియో విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. చివ‌రి సీన్‌లో చైతూ బుగ్గ‌పై సాయిప‌ల్లవి గ‌ట్టిగా ముద్దాడుతుంది. ఆ సీన్‌ని చూసి ప్రేక్ష‌కులే నోరెళ్ళ‌పెట్టారు. ఇక చైతూ స‌తీమ‌ణి స‌మంత త‌న ట్విట్ట‌ర్‌లో వీడియో బాగుంద‌ని చెబుతూ.. చివ‌రిలోని సీన్ న‌న్ను షాక్‌కి గురి చేసింది. ఆ సీన్ చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయింద‌ని కామెంట్ చేసింది.

Related posts