telugu navyamedia
సినిమా వార్తలు

స్యామ్‌ సోష‌ల్ మీడియాను అలా వాడుకుంటుందా?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది సమంత. చైత‌న్య‌తో ప్రేమ పెళ్లి తరువాత కూడా వరుస అవకాశాలు అందుకుంటూ చాలా బిజీగా ఉంటోంది. ఒకవైపు సినిమాలు మరో వైపు వెబ్ సిరీస్ మాత్రమేకాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్స్, రిబ్బన్ కటింగ్స్ మరియు టీవీ షోలతో కూడా సమంత ప్రేక్షకులను అలరిస్తోంది. సోషల్ మీడియాలో ఈ అమ్మ‌డుకు ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఏకంగా 18 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకొంది.

Samantha Akkineni: Have broken lots of rules in 'The Family Man 2' - The  Samikhsya

ఇందులో భాగంగా సమంత తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ కి దాదాపు 25 నుండి 30 లక్షల వరకు తీసుకుంటోందని సమాచారం. ఒకవైపు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను షేర్ చేసే సమంత మరోవైపు కమర్షియల్ పోస్టును కూడా షేర్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తోంది. మిగతా హీరోయిన్లు అందరూ ఒక పోస్ట్ కి ఎనిమిది నుండి పది లక్షల దాకా తీసుకుంటే సమంతా మాత్రం ఈ విషయంలో తగ్గేదే లే అంటూ 25 నుండి 30 లక్షలు డిమాండ్ చేస్తోందట.

Samantha Akkineni praises this Telugu Film so much

సమంతకు భారీ ఫాలోయింగ్ ఉండడంతో బ్రాండ్ ప్ర‌మోట‌ర్స్ సైతం త‌మ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌చారం చేయించుకుంటున్నారు. ఎంతైనా ఈ భామ‌కు ఉన్న‌ పాపులారిటీ అలాంటిది మ‌రీ..! కాగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న శ‌కుంతులం మూవీలో మునుపెన్నడూ చేయని పాత్రలో స‌మంత న‌టిస్తోంది.

Related posts