telugu navyamedia
సినిమా వార్తలు

ఓ రేంజ్‌లో కుమ్మేస్తున్న ర‌కుల్‌..!

ఫిట్‌నెస్‌కు హీరోయిన్స్ ఎంత‌ ప్రియారిటీ ఇస్తారో అంద‌రికీ తెలిసిందే..! ఏం తినాలో..? ఏం తిన‌కూడ‌దో ? ఒట చాట్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అందుకు భిన్నంగా పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. ఏం తింటారో తెలుసా..? ఎంత తింటారో తెలుసా..? తెలియదు కదా..! కాని ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో మాత్రం కాస్త గట్టిగానే తింటున్నారు.

Rakul Preet Singh displays her love for food by devouring yummy dishes; Watch VIDEO | PINKVILLA

“వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్”తో 2013లో టాలీవుడ్ లో అడుగు పెట్టింది ముద్దుగుమ్మ‌ రకుల్ ప్రీత్ సింగ్. అప్పటి నుండి ఆమె టాలీవుడ్‌లోనే కాకుండా అనేక ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలలో కూడా బిజీ అయిపోయింది.రకుల్ ప్రీత్ ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటీమణులలో ఒకరు. త‌న న‌ట‌న‌తో కుర్రకారుని బుట్ట‌లో వేసుకుంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానుల‌కు పంచుకుంటూ ఉంటుంది.

Rakul Preet Singh: 5 stunning pictures of the actress that can make your jaws drop | The Times of India

అందులో భాగంగానే తాజా పోస్ట్‌లో రకుల్ ఫుడ్ పట్ల తనకు ఉన్న ప్రేమను చాటుకుంది. ఈ బ్యూటీ వివిధ రకాల డిజర్ట్‌లతో పాటు కొన్ని ఆహారపదార్థాలను తింటున్న ఫొటోలన్నీ ఒకేచోట చేర్చిన వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో నెటిజన్లకు నోరూరిస్తోంది.  సోష‌ల్ మీడియాలో విడియో వైర‌ల్ గా మారింది.

Rakul Preet Singh Wiki, Age, Height, Boyfriend, Movies, Photos & More - Celebsunfolded

ప్ర‌స్తుతం ..రకుల్ ప్రీత్ సింగ్ క్రిష్, వైష్ణవ్ తేజ్ మూవీలో కనిపించనుంది. తమిళంలో శివకార్తికేయన్ సరసన “అయలాన్”, కమల్ హాసన్‌తో కలిసి “ఇండియన్ 2” చిత్రాలలో నటిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్, సిద్ధార్థ్ మల్హోత్రా తో “థాంక్ గాడ్‌”, “మేడే”తో సహా మరో మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టింది. ఆమె జాన్ అబ్రహం సరసన “అటాక్” అనే సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉంది.

Related posts