telugu navyamedia
సినిమా వార్తలు

ఆ ఉద్దేశంతోనే ప్ర‌కాశ్‌రాజ్ ట్వీట్ – ‘మా’లో దూమారం!

సినీ ప‌రిశ్ర‌మ‌లో మా ఎన్నికలు రోజు రోజుకీ వేడిపుట్టిస్తున్నాయి. ఇంకా ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉండగా.. అభ్యర్థులు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాశ్‌ రాజ్‌ చేసే వరుస ట్వీట్‌లు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలను మరింత వేడెక్కిస్తున్నాయి.

ఇటీవ‌ల ప్రకాశ్ రాజ్ ఇటీవల ధనుష్ తమిళ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న సమయంలో పొరపాటున జారిపడటంతో భుజానికి గాయమైంది. చేతి ఎముక చిట్లడంతో హుటాహుటిన హైదరాబాద్ వచ్చి డాక్టర్ గురవారెడ్డి సమక్షంలో ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

తాజాగా ప్రకాశ్ రాజ్ ‘జెండా’ ఎగరేస్తాం అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఫిల్మ్ నగర్ లో కొత్త చర్చకు దారితీసింది. ఆయన దీనిని ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవంను ఉద్దేశించి పెట్టి ఉండకపోవచ్చునని, త్వరలో జరుగబోతున్న మా ఎన్నికల్లో తాము జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నార‌ని కొందరంటున్నారు.

దీంతో సినీ పరిశ్రమలో మరోసారి ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్ అవుతుంది మొత్తం మీద ఈసారి జరుగబోతున్న ‘మా’ ఎన్నికలు రంజుగానే ఉండబోతున్నాయి. ఒకవైపు ‘మా’ ఎన్నికల్లో చురుగ్గా ఉంటూనే మరోవైపు షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

Related posts