telugu navyamedia
రాజకీయ

ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర‌వేసిన ప్రధాని

దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. ముందుగా రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. ఎర్రకోటపై ప్రధాని హోదాలో 8వసారి ప్రధాని మోదీ జెండా ఎగరవేశారు.

సైనిక దళాల నుంచి గౌరవ వందనం ప్రధాని స్వీకరించారు. వైమానికదళ హెలికాఫ్టర్లు పూలవర్షం కురిపించాయి. జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధాని మోది జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన త్యాగధనులను దేశం స్మరించుకుంటోందన్నారు. దేశ స‌రిహ‌ద్దుల్లో నిరంత‌రం ప్ర‌హార కాస్తున్న‌వీర‌జవాన్లుకు ప్ర‌మాణాలు.

క‌రోనా పై సిబ్బంది చేసిన పోరాటం అస‌మానం. ప్ర‌జ‌లు ప్రాణాలు కాపాడిన డాక్ట‌ర్లుకు ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంద‌ని మోదీ చెప్పారు. ఒలింపిక్స్‌లో ప‌త‌కాలు సాధించిన వారంతా మ‌న‌కు మ‌న‌స్పూర్తి అని, ప‌త‌కాలు సాధించిన వారంద‌రికి యావ‌త్తు దేశం గౌర‌వం ప్ర‌క‌టిస్తోంద‌న్నారు. వాళ్ళు కేవ‌లం ప‌త‌కాలు సాధించ‌డ‌మే కాదు..దేశం గౌర‌వం , న‌వ యువ‌త‌కు స్పూర్తిగా నిలిచార‌ని ప్ర‌సంగించారు.

 

‘‘సంపూర్ణ వికాసానికి పోషకాహార లోపం అతిపెద్ద అడ్డంకి. పోషకాహారంతోపాటు వైద్యం కూడా అత్యంత కీలకమైంది. మండలస్థాయి వరకు సంపూర్ణ వైద్య సౌకర్యాలు అందించే ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతి ఆస్పత్రికి వైద్య వసతులతోపాటు ఆక్సిజన్‌ ప్లాంటుకు చర్యలు తీసుకుంటున్నాం. సంపూర్ణ ఆరోగ్య సాధన కోసం వైద్యుల సంఖ్యను పెంచాల్సి ఉంది. వైద్యుల సంఖ్యను పెంచేందుకు వైద్యవిద్యలో ఎన్నో సంస్కరణలు చేపట్టాం. ఓబీసీల్లో ఎవరు ఉండాలనే దానిపై రాష్ట్రాలకే అధికారం ఇచ్చాం. రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకుని ప్రతి ఒక్కరికీ లబ్ధి కలిగేలా చూడాలి. చిట్టచివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాల్సిన అవసరం ఉందని’’ ప్రధాని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌ వికాసానికి చర్యలు చేపట్టామని మోదీ అన్నారు. లద్ధాఖ్‌లో సింధూ సెంట్రల్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్‌నెట్‌ను గ్రామస్థాయికి అందిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు.

మ‌రోవైపు భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకుల దృష్ట్యా ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీచేసింది. దీంతో దేశ వ్యాప్తంగా భద్రతా దళాలు హై అలర్ట్ ప్రకటించాయి. సంఘ వ్యతిరేక శక్తులు, అనుమానాస్పద వ్యక్తులు, ఖలిస్తానీ ఉద్యమంతో సంబంధం ఉన్నవారు, పోలీసు యూనిఫాంలో ఆటంకాలు సృష్టించవచ్చు అని ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో.. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పోలీసులు అలర్ట్ అయ్యారు. భద్రతాపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

Related posts