telugu navyamedia
సినిమా వార్తలు

వర్మ ముహూర్తం… “లక్ష్మీస్ ఎన్టీఆర్” విడుదల ఖరారు…

RGV

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాను తీస్తున్న సంగతీ తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్స్ ఇప్పటికే ప్రకంపనలు రేపుతున్నాయి. ఇటీవలే ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. తాను రాజకీయ ప్రయోజనం కోసం ఈ సినిమాను తీయట్లేదని, నన్ను చంపినా ఈ సినిమా విడుదల మాత్రం ఆగదని స్పష్టం చేశాడు వర్మ. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండడంతో “లక్ష్మీస్ ఎన్టీఆర్” విడుదలకు బ్రేక్ పడుతుందని అంతా భావించారు.

తాజాగా సినిమా విడుదల తేదీనే కాకుండా సినిమా విడుదల సమయాన్ని కూడా వర్మ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మార్చి 22న 12 గంటలకు సినిమా విడుదలవుతుందని, ఎన్టీఆర్ లక్కీ నెంబర్ కు, మార్చి 22 కు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తేదీకి సంబంధాన్ని చూపిస్తూ లెక్కలేసి మరీ ట్వీట్ చేశారు వర్మ. ఈ ట్వీట్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపుగా పూర్తయ్యింది. మరో రెండు మూడు రోజుల్లో సెన్సార్ కు వెళ్ళబోతున్నారు చిత్రబృందం. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11 వ తేదీన ఎన్నికలు జరగబోతుండగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా విడుదల విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు నమోదు చేసుకుంటుందో చూడాలి.

Related posts