telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

న్యూ జెర్సీ లో ‘శకపురుషుడు’ ఆవిష్కరణ

అమెరికాలో వున్న తెలుగు వారంతా ఎన్ .టి .రామారావు 100 అడుగుల విగ్రహ ప్రతిష్టాపనలో భాగస్వాములు కావాలని, ఎన్ .టి .ఆర్ ను భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలపాలనే తమ కృషిలో పాలుపంచుకొమ్మని ఎన్ .టి .ఆర్ .సెంటినరీ కమిటీ చైర్మన్ టి .డి .జనార్దన్ ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు.

ఎన్ .టి .ఆర్. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా న్యూ జెర్సీ లో అన్నగారి అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమం లో జనార్దన్ మాట్లాడుతూ , ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ఇంతమంది రావడం చాలా ఆనందంగా వుంది . అన్నగారు భౌతికంగా మనకు దూరమై 27 సంవత్సరాలు అవుతున్నా వారి జ్ఞాపకాలు ఇంకా మనలో పదిలంగా వున్నాయంటే , తెలుగు జాతిపై వారు వేసిన ముద్రే అన్నారు .
అన్నగారి మీద అభిమానంతో మా కమిటీ అవిశ్రాంతంగా పనిచేస్తుంది . ఇంతవరకు మేము చేసిన కార్య క్రమాలు , తీసుకొచ్చిన పుస్తకాలకు అనూహ్యమైన స్పందన వచ్చిందని జనార్దన్ చెప్పారు .

పార్లమెంట్ సభ్యులు రఘు రామకృష్ణం రాజు, రాజ్యసభ సభ్యలు కనకమేడల రవీంద్ర , స్థానిక తెలుగు దేశం నాయకులు, ఎన్ .టి .ఆర్ . అభిమానులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ‘శకపురుషుడు ‘ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఎన్ .టి .రామారావు శతాబ్ది సందర్భంగా కమిటీ ‘శకపురుషుడు ‘ ప్రత్యేక సంచికను వెలువరించడం ఆనందంగా ఉందని, ఈ ప్రత్యేక సంచిక అపూర్వంగా ఉందని రఘురామ కృష్ణం రాజు తెలిపారు .

‘శకపురుషుడు’ ఎన్ .టి .ఆర్ కు ఇది ఘనమైన నివాళి అని కనకమేడల చెప్పారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా అట్లూరి అశ్విన్ అన్ని ఏర్పాట్లు చేశారు .

Related posts