telugu navyamedia
సినిమా వార్తలు

విజయ్ సేతుపతిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్

Super-Deluxe

ఇటీవల విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటించిన “సూపర్ డీలక్స్” విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో సినిమా హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. త్యాగరాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ వేశ్య పాత్రలో, సమంత ఓ విభిన్నమైన పాత్రలో కన్పించారు. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి హిజ్రాగా ఛాలెంజింగ్ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. శిల్పా అనే హిజ్రా పాత్ర పోషించిన విజయ్ సేతుపతి తన పాత్రలో భాగంగా డబ్బు కోసం పిల్లల్ని అపహరించి, ఇతరులకు అమ్ముతుంటాడు. అయితే ఇప్పుడు సినిమాలో ఉన్న ఈ సన్నివేశాలు హిజ్రాల మనోభావాల్ని దెబ్బతీశాయని, హిజ్రాలు ఎప్పుడైనా అలా పిల్లల్ని కిడ్నాప్ చేయడం చూశారా? అంటూ హిజ్రా సంఘాల వారు ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాలో తమను తప్పుగా చూపించారంటూ హిజ్రా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆ పాత్ర పోషించిన విజయ్ సేతుపతిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై విజయ్ సేతుపతి ఏమంటారో చూడాలి.

Related posts