telugu navyamedia
సినిమా వార్తలు

“సమాజంలో మార్పు కోసమే జై భీమ్ సినిమా” చంద్రు ..

తమిళ కథానాయకుడు సూర్య నిర్మించి నటించిన “జై భీమ్ ” సినిమా గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటున్నారు . ఈ సినిమా చూసిన చాలామంది ఆలోచనల్లో మార్పు రావాలనే మేము కోరుకున్నాము , మేము ఆశించిన ఫలితం కనిపిస్తుంది అని చెప్పారు మాజీ న్యాయమూర్తి చంద్రు .

Meet Justice K Chandru, the inspiration behind Suriya's 'Jai Bhim' - The  Hindu

1993లో తమిళనాడులో జరిగిన ఒక వాస్తవ సంఘటన ప్రేరణతో నిర్మించిన సినిమా “జై భీమ్ “. ఈ సినిమాలో రాజకన్ను అనే గిరిజన యువకుణ్ణి పోలీసులు దొంగతనం నేరారోపణపై అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెడతారు , అతను లాకప్ లో చనిపోతాడు . అతని భార్య సెంగనీ చేసే న్యాయపోరాటమే ఈ చిత్రం . ఇందులో సెంగినీ తరుపున వాదించే న్యాయవాది చంద్రుగా సూర్య నటించాడు . ఈ సినిమా దేశంలో ప్రకంపనలు సృష్టిస్తుంది .

Jai Bhim review: Suriya's most powerful drama yet | Entertainment News,The  Indian Express

తమిళనాడు హై కోర్టు లో న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేసిన చంద్రు వాదించిన కథే 
ఈ సినిమా విడుదల తరువాత ఎవరీ చంద్రు ? ఏమిటి అతని కథ ? అని నెట్ లో శోధించడం మొదలు పెట్టారు చంద్రు ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటీర్వ్యూ లో అనేకమైన సంచలన విషయాలు బయట పెట్టారు .
నేను మొదట కమ్యూనిస్టు పార్టీలో పనిచేశాను . అప్పుడే నేను లాయర్ అయితే ఎక్కువ మందికి న్యాయం చెయ్యవచ్చునని భావించాను . అందుకే న్యాయవాదినయ్యాను . న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేరోజుల్లో 1975, 76లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు . అప్పుడు తమిళనాడులో ఎంతోమంది రాజకీయ నాయకులను అరెస్టు చేసి జైల్లో చిత్ర హింసలు పెడుతున్నారని తెలుసుకొని , కోర్ట్ ద్వారా వారికి న్యాయం చేయగలిగాను , అదే నా తొలి సామజిక విజయం అన్నారు చంద్రు .

Interview With Justice Chandru,Who Inspired 'Jai Bhim' Movie

న్యాయమూర్తి అయినా తరువాత నాకు నేనే కొన్ని నియమాలు పెట్టుకొన్నాను, ఏమాత్రం ప్రలోభాలకు లొంగకుండా , అట్టడుకు వర్గాలకు , అణగారిన కులాల వారికి న్యాయం చేయాలన్నదే నా ఉద్దేశ్యం . కోర్టుకు వచ్చిన ప్రతి కేసును సత్వరమే పరిష్కరించాలనే ఆ అభిప్రాయం . అందుకే నేని రోజుకు 18 గంటలు పనిచేసేవాణ్ణి అనే చెప్పారు.

రాజకన్ను , సెంగనీ ల కథ విని దర్శకుడు జ్ఞానవేలు చాలా ప్రభావితమయ్యాడు . ఆ కథ తెర మీద మలచడానికి అతను అహోరాత్రులు పనిచేశాడు . ఈ సినిమాలో లాయర్ పాత్రలో నటించడానికి సూర్య ఒప్పుకోడంతో ఈ సినిమాకు ఓ ప్రత్యేకత వచ్చింది . నిజానికి సూర్య నటించిన లాయర్ పాత్ర అతి సహజమైనది . ఎలాంటి గ్లామర్ లేనిది . హీరోయిన్ లేదు, పాటలు లేవు , ఫైట్ లు లేవు . అన్నిటికన్నా కోర్ట్ సన్నివేశాలు అతి సహజంగా వచ్చాయి అని చంద్రు తెలిపారు . ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి ప్రతి సందర్భంలో నేను వున్నాను , నా సూచనల ప్రకారమే లాయర్ పాత్రను రూపొందించారు . కోర్ట్ సన్నివేశాల్లో మెలోడ్రామా లేకుండా, అరుపులు , బల్లలు చరచడం , న్యాయమూర్తులను హాస్య పాత్రలుగా మలచకుండా , అతి సహజంగా ఉండేలా రావడానికి సూర్య , దర్శకుడు జ్ఞానవేలు న సూచనలు పాటించారు అని వివరించారు చంద్రు .

10 Jai Bhim Movie Inspiring Dialogues & Quotes

న్యాయవాద వృత్తి అతి పవిత్రమైనది . దాన్ని డబ్బు కోణంలో కాక సామాజిక న్యాయ కోణంలో చూడాలని యువ న్యాయవాదులకు నా సలహా . మనిషిని మనిషిగా చూసినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది . ఆ మార్పు కోసమే నేను ఇప్పుడు పనిచేస్తున్నా అని చెప్పారు చంద్రు ఎంతో వినమ్రంగా .

– భగీరథ

Related posts