సఖీ! నాప్రేమ ముఖీ!!
నా హృదయ సుఖీ!
అనురాగపు రాఖీ!!
గతకాలపు చేదు జ్ఞాపకాల
పీడకలలను గాలికి వదిలేసి,
మూగ మనసుకు తగిలిన గాయాలను పాత వత్సర మే పాతి పెడదాం!
గమ్యం చేరని జీవితలక్ష్యాలను
 ఛేదించి,సాధించి 
 నూతన వత్సరాన
విజయదుంధుబి  మ్రోగిద్దాం!
క్రొత్త క్రొత్త ఆశలతో
గిత్తలాగ సాగుదాం
నత్త నడక మానుదాం 
విత్తువోలె సత్తువతో 
 అడ్డంకి పొరలను 
అడ్డంగా నరుకుకుంటూ
అజ్ఞానపు చీకట్లను చీల్చుకుంటూ
విజ్ఞానపు గగన వీధుల్లో
విజయబావుటా ఎగురేద్దాం
మాలలో దారంలా,
పూవులో తావిలా
వదనంలో నవ్వులా
గుబాళించు పువ్వులా
సిగలో మల్లెలలా
మెడలో హారంలా
నుదుటపైన బొట్టులా
ప్రాణమిచ్చు చెట్టులా
పాలలో నీళ్ళలా
నాసికలో శ్వాసలా
క్రొత్త ఏడు మొదలిదుదాం
స్వాగతం-సుస్వాగతమంటూ
ప్రేమ పావురాలై
నూతన సంవత్సరంలో కాలిడుదాం! ప్రియ సఖీ!!
పాత వత్సరానికి చరమగీతం పాడుదాం
-గద్వాలసోమన్న, ఎమ్మిగనూరు



చంద్రబాబు, జగన్ ఇద్దరూ దొందూ దొందే: కన్నా