telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ప్రభుత్వ ఉద్యోగుల తాటతీసిన .. టిక్ టాక్ .. అధికారుల చర్యలు..

huge penalty on tik tok by america

సామజిక మాధ్యమాలను వయోభేదం లేకుండా అందరు వాడేస్తున్నారు. దాదాపు వాడటం ప్రారంభించిన చాలా తక్కువ సమయంలోనే వారందరు ఆయా మాధ్యమాలకు బానిసలైపోతున్నారు. అందులో ఎక్కువగా ప్రభావం చూపుతున్నది మాత్రం టిక్ టాక్ అంటున్నారు. తాజాగా, ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది టిక్ టాక్ లో మునిగితేలుతున్నట్టు తెలుసుకున్న అధికారులు, వారిని సెక్షన్లు, డిపార్టుమెంట్లు మార్చారు.

సిబ్బందిలో క్రమశిక్షణ కొరవడిందని విమర్శలు రావడంతో చర్యలకు ఉపక్రమించిన అధికారులు, తొలుత వారి సెక్షన్లను మార్చారు. ఆ తరువాత కూడా వీరి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుండటంతో, ఈ వీడియోలు చేసిన అందరినీ శానిటేషన్ విభాగానికి మారుస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, గత కొంత కాలంగా కార్పొరేషన్ ఉద్యోగులు టిప్ టాప్ గా తయారై వచ్చి, టిక్ టాక్ వీడియోలను తీసుకుంటూ, విధులను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే.

Related posts