telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం కేసీఆర్‌ పెద్ద సన్యాసి : జగ్గారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే పెద్ద సన్యాసి కేసీఆర్ అని..మరి సన్యాసి కొడుకు కేటీఆర్ కూడా సన్యాసే కదా ? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కలెక్టర్లు చప్రాసి కన్నా హీనంగా మారారని.. కలెక్టర్ లు ఐఏఎస్ విలువ తీసేస్తున్నారని మండిపడ్డారు జగ్గారెడ్డి. జగిత్యాలలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తలపెట్టిన రైతు ముఖాముఖీ కార్యక్రమంలో మాట్లాడారు జగ్గారెడ్డి. అధికారులకు, పోలీసులకు కార్యకర్తలు భయపడవద్దని పేర్కొన్నారు జగ్గారెడ్డి. అధికారులు, పోలీసులు బెదిరిస్తే.. వారి పేర్లు నోట్‌ చేసుకోవాలని.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వారి మెడలు వంచుతామని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. కేసీఆర్ ప్రజలను మోసం చేసే నాయకుడని… కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికి భయపడొద్దని సూచించారు.

Related posts