telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తెలుగు దేశం పార్టీ అవసాన దశలో ఉంది: సజ్జల

టీడీపీ అవసాన దశలో వెంటిలేటర్ పై ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతిలో ఆయన మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు ..ప్రజాభిమానంతో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారని అన్నారు. ఎన్టీఆర్ హాయంలోని ఉన్న టీడీపీ వేరు.. ఇప్పుడున్న టీడీపీ వేరన్నారు. టీడీపీది 40 ఏళ్ల సంబరం కాదన్నారు. 27 ఏళ్ల సంబరమే అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

1995లో ప్రజా నిర్ణయంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ నుండి చంద్ర‌బాబు చేతిలోకి టీడీపీ మారడానికి మధ్య చోటు చేసుకొన్న పరిణామాలపై కూడా చర్చించాలని ఆయన టీడీపీ నేతలకు సూచించారు. ఈ సమయంంలో ఓ వర్గం మీడియా కూడా కీలక పాత్ర పోషించిందన్నారు.

టీడీపీ పుట్టి 40 సంవత్సరాలు అయిందని సంబరాలు చేసుకుంటున్నారని ఇలా సంబరాలు చేసుకోవడంలో తప్పు లేదని పేర్కొన్నారు . కుట్రలతో ఎలా అధికారంలోకి రావాలనేది టీడీపీ పాలసీ అని ఆయన ఎద్దేవా చేశారు.

ఎన్టీఆర్ ని గద్దె దించడం కోసం చంద్రబాబు కొందరితో కలిసి కుట్ర చేశారని పేర్కొన్న సజ్జల.. ఎన్టీఆర్ ప్రజా అభిమానంతో అధికారంలోకి వస్తే, చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ తో అధికారంలోకి వచ్చారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఘనత చంద్రబాబుదని ప్రజల పేర్కొన్నారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ ఆవిర్భావం కూడా మీడియా మేనేజ్మెంట్ ఉంది. కానీ అప్పటి రాజకీయ అవసరం వేరు. అప్పుడు జర్నలిస్టుగా దగ్గరగా అన్ని పరిణామాలు చూసిన వాడిని అని అన్నారు.

టీడీపీకి బాగా ఊదడమే ఎల్లో మీడియా పని అని సజ్జల విమర్శించారు. రెండు సార్లు సంక్షేమ క్యాలెండర్ ను విడుదల చేశామన్నారు.మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95 శాతం అమలు చేసినట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు.

గత ప్రభుత్వం చేసిన అప్పులను కూడా తమ ప్రభుత్వం తీరుస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. టీడీపీ హయంలో ప్రవేశ పెట్టిన ఒక్క మంచి పథకం ఏదైనా ఉందా అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు

కానీ చంద్రబాబు హయాంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని తొక్కి పూర్తిగా వ్యవస్థలను తనకు అనుకూలంగా మార్చుకున్న తీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.

జగన్ పూర్తిగా ప్రజాభిమానంతో ఆవిర్భవించిన నాయకుడని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ప్రజల నుండి ఎదిగిన వైఎస్ఆర్, జగన్ ల ముందు చంద్రబాబు ఎత్తుగడలు పారలేదని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Related posts