telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అసభ్యంగా ఉన్నా.. నాలుగు గోడల మధ్య జరిగింది..గోరంట్ల కంటే చంద్రబాబు ఓటుకు నోటు కేసే పెద్దది

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిమరో సారి స్పందించారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ పై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది.

ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. గోరంట్ల మాధవ్ లైంగికంగా వేధింపులకు గురి చేసినట్టుగా అసలు ఫిర్యాదే రాలేదన్నట్లుగా స్పందించారు.

జుగుస్పాకరంగా వీడియోలో ఉందని.. అది తనది కాదని గోరంట్ల మాధవ్ చెబుతున్నారన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రానప్పుడు చర్య తీసుకునే అవకాశం లేదని సజ్జల తేల్చేశారు. ఈ వీడియోకు సంబంధించిన నివేదిక ఇంకా రాలేదన్నారు. మార్ఫింగ్ కాదని తేలితే కచ్చితంగా చర్యలు ఉంటాయ‌ని అన్నారు.

వీడియో అసభ్యంగా ఉన్నా నాలుగు గోడల మధ్య జరిగిన ప్రైవేటు వ్యవహారం అని.. అసలు బాధితులు లేకపోయినా మీడియానే ఎక్కువ హడావుడి చేస్తోందన్నారు. ఈ వీడియోపై విచారణ జరుగుతోందని, నిందితులెవరైనా సరే వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు.గంటలో రిపోర్టు వస్తుంది అని టీడీపీ నేతలు చెప్తున్నారు

గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో కంటే చంద్రబాబు ఓటుకు నోటు అంశమే పెద్దదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు .గతంలో తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబు వాయిస్‌తో వచ్చిన.. ఆడియోకు సపోర్టింగ్‌గా డబ్బులు కూడా దొరికాయని తెలిపారు. ఆవాయిస్ చంద్రబాబుదో కాదో ఇప్పటికీ తేల్చలేదన్నారు. 

గోరంట్ల వ్యవహారంలో మార్ఫింగ్ కాదని తేలితే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నిజానిజాలు తేలేవరకూ ఆగాలని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Related posts