telugu navyamedia
సినిమా వార్తలు

‘బాహుబలి 2’ రికార్డును ‘ఆర్​ఆర్​ఆర్’​ బ్రేక్ : తొలి రోజు కలెక్షన్లలో ఆల్ టైం రికార్డు

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్​ఆర్​ఆర్​’ భారీ విజయం విజయం దిశగా దూసుకుపోతుంది. విడుదలకు ముందే కలెక్షన్ల పరంగా రికార్డులు నమోదు చేసిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు వసూళ్లలోనూ ఆల్​టైం​ రికార్డులను సెట్​ చేస్తోంది.

DETAILS: RRR 1st Day Box Office Collection Till Now, World Wide Total  Earning Report Reviews, Hit Or Flop & More!

ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 10,000 వేలకు పైగా స్క్రీన్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అంతేకాదు విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.

అమెరికాలోనే ప్రీమియర్స్​తో పాటు తొలి రోజు కలెక్షన్లు 5 మిలియన్ల మార్కును దాటేశాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రీమియర్స్​లో ‘బాహుబలి 2’ రికార్డులను బ్రేక్​ చేసిన RRR.. ఫస్ట్ డే కలెక్షన్ విషయంలోనూ అదే జోరు కొనసాగిస్తోంది.

ఇక ఫస్ట్ డే ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో కలిపి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది ‘ఆర్​ఆర్ఆర్’​. ఇప్పటివరకు ఇదే టాప్ .

 

SS Rajamouli's magnum opus RRR gets new release date | The News Minute

నైజాంలోనూ ‘ఆర్​ఆర్​ఆర్’​ జోరు చూపిస్తోంది. తొలిరోజే రూ. 23.35 కోట్లు వసూలు చేసి.. కొత్త చరిత్రకు నాంది పలికింది. నైజాంలో తొలి రోజు కలెక్షన్స్ విషయంలో ‘భీమ్లానాయక్’​- రూ.11.85 కోట్లతో సెకండ్ ప్లేసులో ఉంది.

ఇక కర్ఱాటకలో ఈ సినిమా రూ. 8 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో రూ. 5కోట్ల వరకు వచ్చే అవకాశాలున్నాయి. కేరళలో ఈ సినిమా రూ. 2 కోట్ల వరకు రాబట్టే అవకాశాలున్నాయి. హిందీలో ఫస్ట్ టాక్ షో బట్టి.. మొదటి రోజు రూ. 10నుంచి రూ. 12 కోట్ల మధ్య గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయి.

RRR Impact: Social Media Naatufied

మొదటి రోజు ఆర్ ఆర్ ఆర్ భారత దేశంలో రూ. 120 కోట్ల నుంచి రూ. 125 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు పుష్కలంగా క‌నిపిస్తున్నాయ‌ని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Related posts