telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఉగాది తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.. నిరంజన్ రెడ్డి

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాష్ట్ర మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధాన్యం కొనాలని అడిగితే.. అవహేళగా మాట్లాడుతున్నారని.. రాష్ట్ర ప్రజలను అవమానపరుస్తున్నారని నిరంజన్​రెడ్డి, గంగుల కమలాకర్​, ప్రశాంత్​రెడ్డి, పువ్వాడ అజయ్​కుమార్ దుయ్యబట్టారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉగాది తర్వాత ఉద్ధృతంగా ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వినతిపత్రంలోని అంశాలను చూడకుండా.. తెలంగాణ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రుల అవగాహ రాహిత్యాన్ని తెలంగాణ ప్రజలు సహించరని చెప్పారు.

Thumbnail image

తెలంగాణలో యాసంగి వడ్లు మిల్లింగ్‌ చేస్తే నూకలు ఎక్కువగా వస్తాయని, బాయిల్డ్‌ రైస్‌ కొనకపోతే ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని..ధాన్యాన్ని కొని కేంద్రమే మిల్లింగ్‌ చేసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు

రా రైస్‌, బాయిల్డ్‌ రైస్‌ అని కన్ఫ్యూజ్‌ చేయడం తప్ప కేంద్రం ఏం చేస్తుంది. మేము వడ్లు ఇస్తం.. ఏం చేసుకుంటారనేది కేంద్రం ఇష్టం. తెలంగాణ రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే కిషన్‌ రెడ్డి ఏం చేస్తున్నారు..?. ఆయనకు రైతుల కష్టాలు పట్టవా. మేము ఇన్నిసార్లు పీయూష్‌ గోయల్‌ను కలిస్తే ఒక్కసారి అయినా కిషన్‌రెడ్డి వచ్చాడా..?.వడ్లు కొనాల్సిన బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు.

కేసీఆర్‌ ఉన్నంతకాలంగా తెలంగాణ రైతులకు రక్షణ కవచం ఉన్నట్టేనని అన్నారు. తెలంగాణ రైతులకు బీజేపీ క్షమాపణ చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని’ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. 

Related posts