telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

సర్పంచ్‌లు గ్రామవికాసానికి పాటుపడాలి: కేసీఆర్ 

cm kcr red signal to 3 sitting mps
గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. గ్రామ పంచాయతీలకు అవసరమైన అన్ని నిధులు కేటాయిస్తామన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డుసభ్యులు ప్రజలను కలుపుకొని గ్రామవికాసానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. 
గ్రామ పంచాయతీ కొత్త చట్టం, బాధ్యతలు, విధులు, నిధులు సమకూర్చుకునే మార్గాలు, ఖర్చు పెట్టే పద్దతులు, ప్రజాప్రతినిధులుగా సర్పంచ్ ల నైతిక నియమాలపై కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
1) నీటి/ ఇంటి పన్నులు వచ్చేవి, వచ్చినవి ప్రతి నెలా నోటీసు బోర్డుపై చూపాలి.
2) ప్రతి నెలా వీధి లైట్స్ చెక్ చేసి, లైట్స్ వేయాలి. ఎన్ని వేసారో నోటీసు బోర్డు పై చూపాలి.
3) ప్రతి నెలా కొత్త పింఛన్లు ఎవరికి రావాలో వాళ్ళకు ఇప్పించాలి.
4) ప్రతి నెలలో ఒకసారి మరుగుదొడ్లను వాడడం, చెత్తను చెత్త కుండీలో వేయడం లాంటి ప్రోగ్రామ్స్ ను చేపట్టాలి.
5) ఏదైనా పండుగలు వస్తే వాటికి ఐన ఖర్చులు నోటీసు బోర్డులో చూపించాలి.
6) గవర్నమెంట్ ఫండ్స్ వస్తే ఎంత వచ్చాయో, ఎంత ఖర్చులు ఐనయో నోటీసు బొర్డులో చూపాలి.
7) ప్రతి నెలా గ్రామసభ నిర్వహించాలి. గ్రామ ప్రజలను గ్రామంలో ఎం అవసరం ఉందో తెలుసుకొని వాటిని నిర్వహించాలి.
8) ప్రతి ఇంటికి మరుగుదొడ్డి లేని యెడల కొత్త మరుగు దొడ్డిని కట్టించాలి.
9)గ్రామంలో, ప్రతి ఇంటి ఆవరణలో రెండు చెట్లను నాటించాలి.
10) రేషన్ షాప్ లో బియ్యం ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి తెలుసుకోవాలి. బయటి సరుకులు రేషన్ షాప్ లో ఆమ్మరాదు.
ఈ పది పాయింట్లలో ఏలోపం జరిగినా ఆ పదవి నుండి తొలిగించే అధికారం ప్రజలకు ఉన్నదని తెలిపారు. ప్రజలు  గుర్తు ఉంచుకోండి ఏ అన్యాయం జరిగినా పై అధికారికి చెప్పండని సీఎం కేసీఆర్ తెలిపారు.

Related posts