telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసులు మృతి

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు పోలీసులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. భైరిసారంగపురంలో ఓ జవాను మృతదేహం అప్పగించి ఏఆర్‌ కానిస్టేబుళ్లు బొలెరో వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిని క్రాస్‌ చేస్తుండగా వీరి వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పోలీసుల వాహనం నుజ్జునుజ్జయింది. సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

దీనిపై స్పందించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ నలుగురు పోలీసులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసింది అని అన్నారు. ఈ ప్రమాదంలో ఏఆర్ ఎస్‌ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్లు, ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. తక్షణం ఘటనా స్థలాన్ని చేరుకొని వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని రేంజి డీఐజీ, జిల్లా ఎస్పీని ఆదేశించారు డీజీపీ. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేసారు. విధి నిర్వహణలో నలుగురు పోలీసుల మరణం మా పోలీస్ కుటుంబానికి తీరని లోటు… మరణించిన పోలీస్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ప్రభుత్వం, పోలీస్ శాఖ వారి కుటుంబలకు అండగా ఉంటుంది అని డీజీపీ పేర్కొన్నారు.

Related posts