telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నక్కకు మూడే కాళ్లు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం

BJYM రాష్ట్ర అధ్యక్షులు కె.సురేంద్ర మోహన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. బిజెపి బలోపేతం అయితేనే ఎపి అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని…గతంలో టిడిపి, ఇప్పుడు వైసిపి అధికారంలో ఉన్నా.. ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గత, ప్రస్తుత సిఎంలు తమ స్వార్ధం కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారని ఫైర్ అయ్యారు. కుల రహిత, కుటుంబ రహిత పాలన కావాలంటే బిజెపి కి పట్టం కట్టాలని పిలునిచ్చారు. మోడీ సారధ్యంలో చేపట్టిన సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకెళతామని పేర్కొన్నారు. E.W.S రిజర్వేషన్ లు ఎపిలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు మోసం‌ చేశారు కాబట్టే ఆయనను ఓడించారని.. E.W.S ను ఎందుకు అమలు చేయడం లేదో జగన్ ప్రజలకు సమాధానం‌ చెప్పాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తీరు‌వల్ల అగ్ర వర్ణాలలో పేదలు 20వేల మందికి ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. తెలుగు మాధ్యమంలో చదివితే ఎదగరు అని చెప్పడం ప్రభుత్వ అవివేకానికి నిదర్శనమని.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కే ఏ మీడియం అనేది ఎంచుకునే అవకాశం ఇవ్వాలన్నారు. జాతీయ విద్యా విధానంలో కూడా మాతృభాష కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారని.. పదో తరగతి వరకు ఒక్క సబ్జెక్టు అయినా తెలుగులో ఉండాలని డిమాండ్ చేశారు. నక్కకు మూడే కాళ్లు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండటం సరి కాదని.. కేంద్ర పధకాలను రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత పధకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ కూడా ఇదే విధంగా సొంత స్టిక్కర్లు మారుస్తున్నారని మండిపడ్డారు.

Related posts