తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కళాశాలల అభివృద్ధిపై ఏపీ సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్ చల్లా మధు సూదన్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.
నైపుణ్యాభివృద్ధి కాలేజీలు ఏర్పాటు, తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీల్లో కోర్సులు, పాఠ్య ప్రణాళిక తయారీపైనా సీఎం జగన్ ఆరా తీశారు.
పరిశ్రమల అవసరాలపై సమగ్రంగా సర్వే చేశామని, దీని ప్రకారం కోర్సులను ఎంపిక చేశామని సీఎంకు అధికారులు తెలిపారు. కాలేజీల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్‌మెంట్ కళాశాల ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 30 కాలేజీల నిర్మాణం దిశగా ఏపీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.


