telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

పురుగుమందుల అవశేషాలే ఏలూరు పరిస్థితికి కారణం…

ఆంధ్రప్రదేశ్ ఏలూరు వింత వ్యాధి పై నివేదిక సమర్పించారు. పురుగుమందుల అవశేషాలే ఏలూరు పరిస్థితికి కారణం అని తెలుస్తుంది. ఎయిమ్స్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ సహా ప్రఖ్యాత సంస్థలు అభిప్రాయపడ్డాయి. అవి ఎలా మనుషుల శరీరాల్లోకి ప్రవేశించాయన్న దానిపై దీర్ఘకాలంలో మరింత అధ్యయనం అవసరం అని నిపుణులు తెలిపారు. న్యూఢిల్లీ, ఎయిమ్స్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీకి బాధ్యతలు అప్పగించారు సీఎం. క్రమం తప్పకుండా పరీక్షలు చేయాలనీ ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతిజిల్లాలో కూడా ల్యాబులు ఏర్పాటు చేయాలనీ తెలిపారు. క్రమం తప్పకుండా ఆహారం, తాగునీరు, మట్టి నమూనాలపై పరీక్షలు చేయాలని ఆదేశించారు. ఫలితాలు ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎస్‌కు తెలిపారు. ఏలూరు తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. ఆర్బీకేల ద్వారా సేంద్రీయ పద్ధతులు, వ్యవసాయానికి పెద్దపీట వేయాలని సీఎం సూచించారు.

Related posts