ప్రపంచాన్ని వణికించిన కరోనా చైనా నుండి వచ్చింది అని తెలిసిన తర్వాత ఆ దేశం లి అమెరికా చాలా కోపంగా ఉంది. అయితే అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా విదేశాంగ శాఖ కార్యాలయంలో విదేశాంగ విధానాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చైనాకు వార్నింగ్ ఇచ్చారు. చైనా నుంచి ఎదురయ్యె ప్రతి సవాల్‌ను నేరుగా ఎదుర్కొంటామని, అమెరికాకు ప్రయోజనం కలిగించే అన్ని దేశాలతో సయోద్యగా ఉంటామని అన్నారు. ఆర్దిక, మానవ హక్కుల ఉల్లంఘన, మేధోహక్కుల ఛోరీ, ప్రజాస్వామ్యంపై దాడి వంటివి చైనా నుంచి ఎదురైతే నేరుగా ఎదుర్కొంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. అమెరికా భాగస్వామ్య దేశాలపై చైనా దురుసు వైఖరిని సహించబోమని అన్నారు. చైనా విషయంలో అమెరికా తన వైఖరిని స్పష్టం చేయడంతో రాబోయె రోజుల్లో చైనా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టు స్పష్టం అవుతోంది. గతంలో ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో, ఇప్పడు జో బైడెన్ కూడా ఇంచుమించు చైనాపై అదే విధమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post