telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వరుసగా రాహుల్ ను కలుస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు…

Rahul gandhi congress

తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ఠాగూర్‌… పీసీసీ అధ్యక్ష ఎంపిక పై నివేదికను అధిష్టానానికి సమర్పించడంతో… నేతలు ఎవరికి వారు  పదవి పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సీనియర్ల మధ్య పోటీ పెరగడంతో.. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేకపోతోంది కాంగ్రెస్ అధిష్ఠానం.  నూతన సంవత్సరంలోనే టీపీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు ఇన్‌చార్జ్ ఠాగూర్. మరోవైపు ఆశావహులు ఢిల్లీలో లాబీయింగ్ షురూ చేశారు. ఇప్పటికే సోనియాతో సమావేశమైన కోమటిరెడ్డి ..  రాహుల్, కేసీ వేణుగోపాల్ అపాయింట్ మెంట్ కోరారు. అనంతర పరిణామాల్లో రాహుల్ ను కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి విడివిడిగా కలిశారు. పార్లమెంట్ రక్షణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఇక పార్లమెంట్ అనెక్స్ బిల్డింగ్ లో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం సందర్భంగా రాహుల్ గాంధీ ని విడిగా కలిశారు రేవంత్ రెడ్డి. తెలంగాణ పిసిసి నూతన అధ్యక్షుడు నియామకం పై అధిష్ఠానం నిర్ణయం తీసుకోనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాహుల్ తో రేవంత్ రెడ్డి భేటీకి ప్రాధాన్యత నెలకొంది. ఇక మరో వైపు అధిష్టానం పిలుపు మేరకు మరో కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్.. ఢిల్లీ బయలుదేరుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికపై సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు టీ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మాణిక్యం ఠాగూర్. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పీసీసీ అధ్యక్షుడిని నియమిస్తారని అన్నారు.

Related posts