telugu navyamedia
సినిమా వార్తలు

‘పుష్ప’ మూవీ లేటెస్ట్ అప్‌డేట్ ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘పుష్ప . ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇందుల అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‏గా నటిస్తోంది.

Allu Arjun's Pushpa to release on Aug 13, actor reveals with new poster - Movies News

మలయాళం స్టార్‌ హీరో ఫహద్‌ ఫాసిల్‌ ‘పుష్ప’ లో మెయిన్‌ విలన్‌గా నటిసున్నాడు. ఫహద్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పై చిత్ర యూనిట్ తాజాగా ఓ ప్రకటన చేసింది. పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.

శనివారం ఉదయం 10.08గంటలకు ఈ చిత్రంలో విలన్​గా నటిస్తున్న ఫాహద్​ ఫాజిల్ డేంజరస్​ లుక్​ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఇదివరకు ఫహద్‌ పుట్టినరోజు సందర్బంగా ఆయన కంటిని మాత్రమే పోస్టర్ లో చూపించి, పూర్తి లుక్ ను రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు.

Image

మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న సినిమాలో దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్‌లో మొత్తం ఐదు భాషల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నాడు దర్శకుడు సుకుమార్.

Introducing Pushpa Raj: Allu Arjun packs a stunning punch | Telugu Movie News - Times of India

కాగా..ఎప్ప‌డు స్టైలిష్‌గా లవర్‌ బాయ్‌లా ఉండే బన్ని ఈ సినిమాలో ఊరమాస్‌గా భయంకరమైన స్మగ్లర్‌ పుష్పరాజుగా క‌నిపించ‌బోతున్నాడు. ఇక మలయాళీ విలక్షణ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ విలన్ రోల్ పోషిస్తుండటంతో ఈ చిత్రానికి మరింత హైప్ వచ్చింది.

Team Pushpa will reveal the first look of FaFa tomorrow - English

ఈ సినిమాలో అల్లు అర్జున్ , రష్మికా మందన్న, సునీల్‌ శెట్టి, ఫహాద్‌ ఫాజిల్, బాబీ సింహా , జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Related posts