telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా”పై “సాహో” ఎఫెక్ట్… ఏం జరిగిందంటే ?

Syeraa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 20న విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ సినిమా నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కుల కోసం భారీ పోటీ నెలకొన్నప్పటికీ ఓవర్సీస్‌లో మాత్రం తక్కువ రేటుకే ఇవ్వాల్సి వచ్చిందట. దాదాపు 15 కోట్ల రూపాయలకు “సైరా” ఓవర్సీస్ హక్కులను ఫారస్ సంస్థ దక్కించుకుందట. “సైరా” లాంటి పెద్ద బడ్జెట్ సినిమాకు ఇది తక్కువనే చెప్పాలి. అయితే “సాహో” సినిమా తీవ్ర నష్టాలను మిగల్చడంతో “సైరా”ను భారీ రేట్లకు కొనేందుకు ఏ సంస్థా ముందుకు రాలేదట. పైగా ఇటీవలి కాలంలో ఓవర్సీస్ మార్కెట్ సగానికి సగం పడిపోయింది. దీంతో 15 కోట్లకే “సైరా” ఓవర్సీస్ హక్కులను ఇచ్చేశారట.

Related posts