telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దిశ అనే అమ్మాయిని నా జీవితంలో ఒక్కసారి కూడా కలవలేదు : సూరజ్ పంచోలి

Sushanth

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, అతని మేనేజర్ దిశ ఆత్మహత్యల వెనుక ప్రముఖ నటులు సల్మాన్ ఖాన్, సూరజ్ పంచోలీ ఉన్నారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. జాతీయ మీడియాలో కూడా ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. సూరజ్ కారణంగా దిశ గర్భవతి అయిందని, అందుకే ఆమెను, ఆ విషయం తెలుసుకున్న సుశాంత్‌ను సూరజ్ చంపేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించాడని ఓ కథనం ప్రచారంలో ఉంది. దీని గురించి జాతీయ మీడియాతో తాజాగా సూరజ్ మాట్లాడాడు. “ఈ విషయంలోకి నన్నెందుకు లాగారో తెలియడం లేదు. దిశ అనే అమ్మాయిని నా జీవితంలో ఒక్కసారి కూడా కలవలేదు. సుశాంత్ ఆత్మహత్య తర్వాతే ఆమె గురించి విన్నా. 2017లో సుశాంత్‌తో నాకు గొడవ జరిగిందని కూడా అంటున్నారు. అందులో కొంచెం కూడా నిజం లేదు. అలాగే నా జీవితంలోకి ప్రతిసారి సల్మాన్‌ను ఎందుకు తీసుకొస్తున్నారు? ఆయనకు వేరే పనులేమీ ఉండవా? ఈ కథను ఎవరో ఒక వ్యక్తి సృష్టించి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇలాంటి కట్టుకథలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి కదా! నిజాలు తెలియని వాళ్లు ఇలాంటివి నమ్మేస్తుంటారు” అని సూరజ్ అన్నాడు.

Related posts