telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సూర్య సరసన రష్మిక ?

Rashmika

తమిళ స్టార్ హీరో సూర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ప్ర‌స్తుతం ఈయ‌న సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న చిత్రం `ఆకాశం నీ హ‌ద్దురా`(శూరరై పోట్రు). ఈ సినిమా త‌ర్వాత సూర్య హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. హ‌రి స్టైల్ ఆఫ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రంలో మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపించాయి. కానీ లేటెస్ట్ స‌మాచారం మేర‌కు మాళ‌వికా మోహ‌న‌న్ స్థానంలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ సంక్రాంతికి మ‌హేశ్ `సరిలేరు నీకెవ్వ‌రు` సినిమాతో స‌క్సెస్ అందుకున్న ర‌ష్మిక ప్రస్తుతం తెలుగులో నితిన్ కు జోడిగా “భీష్మ” చిత్రంలో నటిస్తోంది. మరోవైపు త‌మిళంలో కార్తితో ఓ సినిమా చేస్తుంది. అదే స్పీడు కార్తి అన్న సూర్య‌తో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ని టాక్‌.

Related posts