telugu navyamedia
సినిమా వార్తలు

రష్మీ కన్నా శాంతి స్వరూప్ బెటరా…!?

Rashmi

బుల్లితెర పాపులర్ షో జబర్దస్త్ లో కామెడీ చేసి నవ్వించే నటీనటులకు ఆ షో ద్వారా బాగానే గుర్తింపు లభించింది. ఇక హైపర్ ఆది స్కిట్ లో లేడీ గెటప్ వేసుకుని నవ్వించే శాంతి స్వరూప్ కు కూడా బాగానే పేరు వచ్చింది. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు లేడీ గెటప్ లో ఉన్న శాంతి స్వరూప్ ను, రష్మిని పోల్చడం చర్చనీయాంశంగా మారింది. రష్మికంటే శాంతి స్వరూప్ చాలా అందంగా ఉన్నాడు అంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ విషయంపై రష్మీ హుందాగా స్పందించింది. ”అది నిజమే… మన చుట్టూ మనల్ని జడ్జ్ చేసే ప్రజలు ఎంతోమంది ఉన్నప్పుడు అలా నటించడం అంత ఈజీ కాదు. కాబట్టి నాకు వారిపై చాలా గౌరవం ఉంది” అంటూ ట్వీట్ చేసింది రష్మీ. ఆమె ఇలా పాజిటివ్ గా స్పందించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న #10ఇయర్స్ ఛాలెంజ్ గురించి మాట్లాడుతూ తనకు ఆ ఛాలెంజ్ పై ఆసక్తి లేదని, గతం వల్ల తాను చాలా నేర్చుకున్నానని, ఆ రెండు ఫోటోలు తాను పడిన కష్టాన్ని నిర్వచించలేవని స్పష్టం చేసింది రష్మీ. రష్మీ బుల్లితెరపై పలు షోలతో బిజీగా గడుపుతోంది.

Related posts