telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బేబీ పెంగ్విన్” అంటూ ముఖ్యమంత్రి కుమారుడిపై కంగనా సంచలన కామెంట్స్

Kangana

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నెపోటిజంపై పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి కుమారుడిని టార్గెట్‌ చేశారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకునే ముందు రోజు రాత్రి అతని ఇంట్లో పార్టీ జరిగిందని, ఇందులో ఓ ప్రముఖ వ్యక్తి పాల్గొన్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె చేసిన ట్వీట్ పలు అనుమానాలకు తావిస్తోంది. “ప్రతీ ఒక్కరికి ఈ విషయం తెలుసు.. కానీ ఎవరూ తన పేరు మాత్రం చెప్పరు.. కరణ్‌ జోహార్‌ ప్రాణ స్నేహితుడు, ప్రపంచంలోనే గొప్ప ముఖ్యమంత్రి గొప్ప కొడుకు.. ఆయనను అంతా ప్రేమగా బేబీ పెంగ్విన్‌ అని పిలుస్తారు.. ఒకవేళ నేను నా ఇంట్లో ఉరి వేసుకుని కనిపిస్తే.. దయచేసి నేను ఆత్మహత్య చేసుకున్నానని మాత్రం అనుకోవద్దని కంగన చెప్తుంది” అంటూ ట్వీట్ చేసింది కంగన. ప్రస్తుతం కంగనా ట్వీట్ నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక బాలీవుడ్ మాఫియా, నెపోటిజం, ఖాన్ కుటుంబాల బంధుప్రీతి ఉందని హీరోయిన్ కంగన రనౌత్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

Related posts