2009వ సంవత్సరంలో “కెరటం ” అన్న సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్..తర్వాత వెకంటాద్రి ఎక్స్ ప్రెస్‌తో వరుస సినిమా అవకాశాలను కొట్టేసింది. ఎన్టీఆర్‌తో నాన్నకు ప్రేమతో, రామ్ చరణ్ తో బ్రూస్ లీ, ధృవ వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన రకుల్…..నాన్నకు ప్రేమతో సినిమాకు ఉత్తమనటి అవార్డును సొంతం చేసుకుంది.
ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ హోదాలో వరుస సినిమాల్లో నటిస్తోంది. తెలుగుతో పాటు తమిళ , కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా ఈ ఢిల్లీ బ్యూటీ నటిస్తోంది. ఈ రోజు రకుల్ ప్రీత్ సింగ్ 32వ వ జన్మదినోత్సవాన్ని స్నేహితుల మధ్య జరుపుకుంది .
కాగా.. ఇటీవలే క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ తో పాటు రకుల్ “కొండపొలం ” అన్న చిత్రంలో నటించింది .
రకుల్ ప్రీత్ సింగ్ కు నవ్య జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది
రైతులను ఉగ్రవాదులతో పోల్చిన కంగనా… కేసు నమోదు