telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నందమూరి తారకరత్న “సారధి” నుంచి లిరికల్ సాంగ్ లాంచ్

పంచభూత క్రియేషన్స్ పతాకంపై నందమూరి తారక రత్న ,కోన శశిత జంటగా జాకట రమేష్ దర్శకత్వంలో పి. నరేష్ యాదవ్, వై యస్ కృష్ణమూర్తి, పి సిద్దేశ్వర్ రావులు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “సారధి”(కోకో నేపథ్యం) సిద్ధార్థ్ వాటికన్స్ సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రం లోని “అల్లరోడే పిల్లడే.. లిరికల్ సాంగ్ ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్లో ,ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు విడుదల చేశారు.అనంతరం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 2020 జనవరిలో జకట రమేష్ దర్శకత్వంలో “రదేరా” (కోకో గేమ్) సినిమా రిలీజ్ చేయడం జరిగింది ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఎన్నో సంవత్సరాల తరువాత. కడపలో మూడు థియేటర్లు హౌస్ ఫుల్ అవ్వడం జరిగింది. అలాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్ ఆ సినిమాకు కంటిన్యూటిగా “సారధి” (కోకో గేమ్) పై నందమూరి తారకరత్న తో పార్ట్ 2 తీస్తున్నాడు.వీరు నలుగురు ఒక టీం ఏర్పడి ఈ సినిమా తీస్తున్న ఈ సినిమాలోని
ఈ సాంగ్ వింటుంటే.. ఇప్పుడు వస్తున్న సాంగ్ వాయిద్యాలు, సౌండ్స్ లలో లిరికిల్ వ్యాల్యూస్ తెలియక ఎదో ఒక సాంగ్ చేస్తున్నారు.ఇలాంటి టైంలో వీరు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా “అల్లరోడే పిల్లడే – వాడి గుండెల్లో వుంటడే, తుంటరోడే వాడెప్పుడూ – కళ్ళల్లోనే వుంటడే,” సాంగ్ వింటుంటే పర్ఫెక్ట్ గా అందరూ పాడుకునే విదంగా అర్ధమయ్యే విదంగా ఉంది.ఇలాంటి సాంగ్ లాంచ్ చేసినందుకు సంతోషంగా వుంది.ఈ సినిమా షూటింగ్ అంతా మన లోకేషన్స్ లలో తీసినా ఫారిన్ లొకేషన్స్ లలో తీసినట్టుగా ఉంది. కడపలో మనకు కావలసిన వాటర్ ఫాల్స్ రకరకాల అద్భుతమైన అందాలు ఉన్నాయి.పంచభూత క్రియేషన్స్ బ్యానర్లో నందమూరి తారకరత్న లాంటి హీరోతో “సారథి””(కోకో నేపథ్యం) అనే అద్భుతమైన టైటిల్ తో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో మన ముందుకు వస్తున్నారు.హిందీలో కూడా స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో అమీరఖాన్,షారుక్ ఖాన్ లు నటించిన చిత్రాలు ఎంతో పెద్ద హిట్ అయ్యాయి.అలాంటి సినిమాల మాదిరే ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి టీం అందరికీ మంచి పేరు తో పాటు,వీరు ఇలాంటి మంచి చిత్రాలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నానని అన్నారు.

నిర్మాత సి.యన్.రావు మాట్లాడుతూ… కొత్త వారైనా ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు.ఇందులో నటించిన నందమూరి తారకరత్న కు “సారథి””(కోకో నేపథ్యం) టైటిల్ యాప్ట్ గా ఉంది. ఈ సినిమా నిర్మించిన చిత్ర బృందానికి పెరుతో పాటు గొప్ప విజయం కలగాలని కోరుతున్నాను.

Related posts