telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హ్యాట్సాఫ్ చిరంజీవి గారు… ఒళ్ళు గగుర్పొడిచింది : నారా లోకేష్

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి” వెండితెరపై ప్రేక్షకులను మెప్పిస్తోంది. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “సైరా” చిత్రాన్ని దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం చేశారు. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు “సైరా”ను అభినందించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా “సైరా”పై ట్విటర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. “తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన సినిమా ‘సైరా’. ఇది చిరంజీవిగారి 12 ఏళ్ళ కల. ఆయన తన కలను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారు. తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్య్ర పోరాటాన్ని తెరపై చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. హ్యాట్సాఫ్! చిరంజీవిగారు. ఎంతో శ్రమించి చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి విజయాన్ని అందుకున్న నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, ఇతర సాంకేతిక సిబ్బందికి హార్దికాభినందనలు” అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

Related posts