telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవర్ స్టార్ అభిమానులు ఎలా ఫీల్ అవుతారో అదే “పవర్ స్టార్” : ఆర్జీవీ

Power-Sttar

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ అనే సినిమా తీసిన విషయం తెలిసందే. అది ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో ఈ సినిమాను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ ”పవర్ స్టార్ సినిమా విజయం చాలా ఆనందనాన్ని ఇస్తుంది. ఈ సినిమా లో నేను చెప్పాలనుకున్నదే చూపించాను. అయితే పవర్ స్టార్ అనగానే సినిమా పైన భారీ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే పవర్ స్టార్ అనే టైటిల్ లో పవర్ ఉంది. ఇక నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి, ఒక ఫ్యాన్ ఎలా ఫీల్ అవుతాడో అలాగే నా సినిమా తీశాను. ఈ సినిమాను తప్పుబట్టే అవకాశం నేను ఎవరికి ఇవ్వలేదు. అయితే నేను చివరి దశలో స్క్రిప్ట్ చేంజ్ చేశాను అనేది అవాస్తవం. నేను మొదటి నుండి ఎలా అనుకున్నానో అలాగే సినిమా తీసాను. అసలు సినిమా చూడకుండానే దాడులు చేశారు. పవర్ స్టార్ అభిమానుల మనసులో ఏముందో అదే విషయాన్ని క్లైమాక్స్ లో చూపించాను” అని తెలిపాడు.

Related posts