telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తమిళ స్టార్ డైరెక్టర్ తో చరణ్ సినిమా ?

RC

కోలీవుడ్ లో దర్శకుడు లోకేష్ కనకరాజ్ వైవిధ్యమైన చిత్రాలతో ఆయన సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇక గత ఏడాది విడుదలైన ‘ఖైదీ’ మూవీ ఆయన ఇమేజ్ అమాంతం పెంచేసింది. ఎటువంటి కమర్షియల్ అంశాలు లేకుండా హీరో కార్తితో చేసిన ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంటుంది. ప్రస్తుతం లోకేష్ హీరో విజయ్ తో మాస్టర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. కాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ లోకేష్ కనకరాజ్ తో ఓ భారీ చిత్రం ప్లాన్ చేస్తునట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ తో ఓ మూవీ చేయడానికి లోకేష్ సైన్ చేశారట. అయితే ఈ భారీ చిత్రంలో నటించే హీరో రామ్ చరణ్ అని వార్తలు వస్తున్నాయి. రంగస్థలం చిత్రంను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చరణ్ చేశాడు. ఆ సినిమా సమయంలోనే మైత్రి మూవీస్ లో మళ్లీ సినిమా చేస్తానంటూ చరణ్ హామీ ఇవ్వడంతో పాటు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. అంతా ఓకే అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత వెంటనే మైత్రి మూవీ మేకర్స్ లో నటించే అవకాశాలు ఉన్నాయి. కాగా తెలుగులో పుష్ప, సర్కారు వారి పాట అనే భారీ చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

Related posts