telugu navyamedia
సినిమా వార్తలు

పింక్ సిటీలో ప్రభాస్ కు ఘనస్వాగతం

Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్పెష‌ల్ డ్యాన్స్‌తో అల‌రించ‌నుంది. బాలీవుడ్ నటులు నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ ఇతర కీలక పాత్రల్లో న‌టించారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాని జ‌నాల‌లో మ‌రింత తీసుకెళ్ళేందుకు చిత్ర బృందం వినూత్నంగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంది. ముఖ్యంగా ప్ర‌భాస్ అన్ని ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచేలా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నాడు. తాజాగా పింక్ సిటీ జైపూర్‌కి సాహో ప్రమోష‌న్స్ కోసం అని వెళ్ళాడు ప్ర‌భాస్. ఆయ‌న‌కి రాజ‌స్థాన్ టూరిజం త‌మ ట్విట్ట‌ర్ ద్వారా గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పింది. “డైన‌మిక్ యాక్ట‌ర్ ప్ర‌భాస్‌కి ఘ‌న‌స్వాగ‌తం. సాహో మూవీని పింక్‌సిటీలో ప్ర‌మోట్ చేసుకోండి” అని ట్విట్ట‌ర్‌లో తెలిపింది.

Related posts