telugu navyamedia
రాజకీయ

నేడు అమేథీలో రాహుల్ నామినేషన్..పూల వర్షంతో ఆహ్వానిస్తున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు అమేథీలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాహుల్‌కు ప్రత్యర్థిగా గత ఎన్నికల్లో ఆయనపై ఓటమి పాలైన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోమారు బరిలోకి దిగారు. రాహుల్ నామినేషన్ కార్యక్రమంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత నదీమ్ అష్రాఫ్ మాట్లాడుతూ.. నామినేషన్ వేసేందుకు వస్తున్న  రాహుల్ తో పాటు ఇతర నేతలపై పూలవర్షం కురిపించి ఆహ్వానించనున్నట్టు తెలిపారు. 
రాహుల్ నామినేషన్ కోసం కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్‌కే చెందిన మరో నేత దీపక్ సింగ్ మాట్లాడుతూ.. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత స్మృతి ఇరానీ అమేథీకి 15 సార్లు మాత్రమే వచ్చారని తెలిపారు. రాహుల్ మాత్రం ఏకంగా 744 గంటలు తన నియోజకవర్గ ప్రజల కోసం కేటాయించినట్టు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతోపాటు కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 4న వయనాడ్‌లో రాహుల్ నామినేషన్ దాఖలు చేశారు.

Related posts