telugu navyamedia
సినిమా వార్తలు

‘కృష్ణ వ్రింద విహారి’ ఫస్ట్​లుక్ : నాగశౌర్య బర్త్‌డే స్పెష‌ల్‌ ట్రీట్ ..

యువహీరో నాగశౌర్య కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. నాగశౌర్య పుట్టినరోజు కానుకగా తనకొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ‘కృష్ణ వ్రింద విహారి’ అనే టైటిల్​తో పాటు శౌర్య ఫస్ట్​లుక్​ను కూడా రిలీజ్ చేశారు.

ఇందులో సంప్రదాయంగా ఉన్న నాగశౌర్య లుక్ ఆక‌ట్టుకుంటుంది. నుదిటిన నిలువుతా తిలకం దిద్దుకుని చేతికి తాడు కట్టుకుని మెడలో డాలర్ వేసుకుని చేతిలో రాగి చెంబుతో నీళ్లు చల్లుతూ హీరో నాగశౌర్య బ్రహ్మణ యువకుడిగా కనిపిస్తున్నాడు.

naga shourya new movie first look

అనీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో షెర్లి శెటియా హీరోయిన్​గా నటిస్తోంది. సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై ఉమ మూల్పూరి నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతమందిస్తున్నారు.

Related posts