telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జిల్లాకో ఎయిర్‌పోర్టు ప్ర‌క‌ట‌న‌పై : అమ్మా! భారతమ్మ సీఎంకి ఎక్కడైనా చూపించమ్మా..లేదంటే

ఇప్ప‌టికే తుగ్లక్ నిర్ణయాలతో రాష్ట్రాన్ని మరింత అప్పుల పాల్జేస్తున్నారని… వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తీవ్ర విమర్శులు గుప్పించారు.

ప్ర‌తీ జిల్లాకో ఎయిర్‌పోర్టు కడతామని చెప్పడానికి సిగ్గులేదా..? అమ్మా ! భారతమ్మ ఈ తుగ్లక్ నిర్ణయాలన్నీ చూస్తుంటే.. సీఎంకి ఏదో అయిందని అనుమానంగా ఉంది వెంటనే ఆస్పత్రిలో చూపించండి.. లేదంటే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారని అయ్యన్న పాత్రుడు వైసీపీ ప్రభుత్వం పై విమర్శల దాడులకు దిగారు.

రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు 7880 కోట్లతో కొడతానని అనౌన్స్ చేసి గతేడాది మే 30 తేదీన 14 మెడికల్ కాలేజీలకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారని గుర్తు చేసిన అయ్యన్నపాత్రుడు ఆ కాలేజీలు ఏమయ్యాయి అంటూ ప్రశ్నించారు.

రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకుండా జిల్లాకో ఎయిర్ పోర్టు కడతాననడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. పోలవరం, ఉత్తరాంధ్రా సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులను పక్కన పెట్టి ఏమిటీ తుగ్లక్ నిర్ణయాలు.. అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో క్వారంటైన్ సెంటర్లలో భోజనాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటికీ కోట్ల రూపాయల పేమెంట్లు చెల్లించలేదని, ఆఖరికి గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలకు మధ్యాహ్న భోజనాలు పెడుతున్న కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదని జగన్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

సంపద సృష్టించడం చేతకాక, ఓటిఎస్ పేరుతో పేద ప్రజల దగ్గర బలవంతపు వసూళ్లకు వైసీపీ తెర లేపిందన్నారు. ఆఖరికి చెత్త, డ్రైనేజి మీద పన్నులు వసూలు చేస్తున్నారని ఇదేం ప్రభుత్వమని అయ్యన్నపాత్రుడు సీరియస్‌ అయ్యారు.

Related posts