telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇమ్రాన్ ఖాన్‌ను కలవాలని అనుకుంటున్నాను : పూనమ్ కౌర్

Poonam-Kaur

నవంబర్ 12న గురునానక్ 550వ జయంతి. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కర్తార్‌పూర్ కారిడర్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ కారిడర్ పాక్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌‌ను పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లాలో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారాకు కనెక్ట్ అయివుంటుంది. ఈ కారిడిర్ గురించి ఇరు దేశాల మధ్య క్ష్రేత్రస్థాయిలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ కారిడర్ ఆవిష్కరణ కార్యక్రమానికి పాక్ తరఫున ఇమ్రాన్ ఖాన్‌ కూడా హాజరుకానున్నారు. ఈ వేడుకకు పూనమ్ కౌర్‌ను కూడా ఆహ్వానించారట ఇమ్రాన్. ఈ విషయాన్ని పూనమ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘కర్తార్‌పూర్ కారిడార్ ఆవిష్కరణకు పాకిస్థాన్ నుంచి నాకు ఆహ్వానం అందింది. ఇందుకోసం నేను నా వీసా పనులు చూసుకుంటున్నాను. ఇది నాకు ఎంతో భావోద్వేగంతో కూడుకున్న నిర్ణయం. సిక్కులు గర్వపడే విషయం. నాకు అధికారులు అవకాశం ఇస్తే నేను ఇమ్రాన్ ఖాన్‌ను కలవాలని అనుకుంటున్నాను. 1947లో విభజన అనంతరం దర్బార్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లిన మొదటి భారతదేశ సిక్కు మహిళను నేనే. గతేడాది వెళ్లినప్పుడు నా వీడియో కూడా వైరల్ అయింది. అలా నా గురించి పాక్‌ ప్రధానికి తెలిసింది. అందుకే కారిడర్ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించారు. ఓ యాత్రికురాలిగా మాత్రమే నేను కారిడర్ ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తున్నాను. నా ఆలోచనలు, ఉద్దేశం కరెక్ట్ అయినప్పుడు ఫలితం కూడా అలాగే ఉంటుంది. గతేడాది నన్ను ఇరు దేశాల మధ్య శాంతికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ పాకిస్థాన్ అవార్డ్ ఇవ్వాలనుకుంది. కానీ ఆ సమయంలో పుల్వామా దాడులు జరుగుతున్నందుకు నేను వెళ్లలేకపోయాను. ఈ విషయంలో ప్రజలు నన్ను టార్గెట్ చేసినా ఫర్వాలేదు. నాకు అలవాటైపోయింది’ అని వెల్లడించారు.

Related posts