telugu navyamedia
రాజకీయ

కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ప్రియాంక గాంధీ ‘యూటర్న్‌’..

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ద‌గ్గ‌ర‌ప‌డుతున్న క్ర‌మంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.  కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై ప్రియాంక గాంధీ క్లారిటీ ఇచ్చింది.

ఎన్న‌డూ జ‌ర‌గని విధంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు. రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయడం ఇద్దరికీ ఇదే తొలిసారి.

ఈ క్ర‌మంలో శుక్రవారం జరిగిన కాంగ్రెస్‌ యూత్‌ మేనిఫెస్టో విడుదల కార్య‌క్ర‌మంలో ఆమె యూపీ సీఎం అభ్యర్థి ఎవరు అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘నేను కాకుండా ఇంకెవరైనా కనిపిస్తున్నారా? మరి ఇంకేంటి? రాష్ట్రంలో ఎక్కడచూసినా నేనే కనిపిస్తున్నానుగా’ అంటూ సమాధానమిచ్చారు. దాంతో అభ్యర్థిగా ఆమె పేరు ఖరారైనట్లు విశ్లేష‌కులు భావించారు.

ఈ విష‌యంపై మ‌రోసారి జాతీయ మీడియా ప్రియాంక గాంధీ వాద్రాను సంప్ర‌దించింది.. దీంతో.. దానిపై మ‌రింత క్లారిటీ ఇచ్చారామె.. .’కాంగ్రెస్ తరఫున నేను యూపీ సీఎం అభ్యర్థినని చెప్పలేదు. మీరు పదేపదే అదే ప్రశ్న అడగుతుండంతో.. చిరాకుగా అనిపించింది. అందుకే అన్ని చోట్లా నేనే కనిపిస్తున్నాగా అన్నాను అని ప్రియాంక చెప్పారు.

అలాగే ఎన్నికల్లో పోటీ చేయడం గురించి మాట్లాడుతూ..’దాని గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీకు వెల్లడిస్తాను’ అని చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మినహా ఏ పార్టీతోనైనా ఎన్నికల తర్వాత పొత్తుకు సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు ప్రియాంక గాంధీ.. ఇదే స‌మ‌యంలో మాయావ‌తిని టార్గెట్ చేసిన ఆమె.. యూపీ ఎన్నికల్లో మాయావతి ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు అర్థం కావ‌డంలేద‌ని.. ఆమె వ్య‌వ‌హార శైలితో తాను ఆశ్చర్యపోయాన‌న్నారు..

Related posts