telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాలువలను పరిశీలించిన హరీశ్‌రావు: అధికారులపై అగ్రహం

harish rao trs

సిద్ధిపేట జిల్లాలో తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. తొగుట మండలంలోని తుక్కాపూర్, పెద్ద మాసాన్ పల్లి, ఎల్లారెడ్డి పేట, బండారుపల్లి మీదుగా ఉన్న ప్రధాన కాలువలో పలుచోట్ల పనులు అసంపూర్తిగా ఉండడంతో ఇరిగేషన్ అధికారులపై మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు.

తొగుట మండలం తుక్కాపూర్‌లోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-12 ద్వారా దుబ్బాకకు, మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు అందించే ప్రధాన కాలువను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. అలాగే దుబ్బాక నియోజక వర్గానికి ప్రధాన కాలువ దాదాపు 40 కిలో మీటర్ల మేర కాలువపై మంత్రి పర్యటించారు. దుబ్బాక ప్రధాన కాలువ ద్వారా నీళ్లు పారుతున్న ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో హరీశ్‌రావు పరిశీలించారు. ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఇరిగేషన్ అధికారులు మంత్రి వెంట ఉన్నారు.

Related posts