telugu navyamedia
రాజకీయ వార్తలు

చైనాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా వ్యూహం!

trump usa

వైరస్‌ను చైనా ల్యాబ్‌లోనే తయారు చేసిందని అమెరికా ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా విపత్తుకు చైనాయే బాధ్యత వహించేలా ఒత్తిడి పెంచేందుకు అమెరికా మరిన్ని చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా భారత్‌తో సైనికపరమైన సంబంధాల్ని బలోపేతం చేసుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా 18 అంశాలతో కూడిన ఓ కార్యాచరణను అమెరికా రూపొందించింది. తమ మిత్రపక్షాలతో సైనిక బంధాన్ని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే భారత్‌తో పాటు తైవాన్‌, వియత్నాం వంటి దేశాలకు ఆయుధాల విక్రయాన్ని విస్తరించాలని నిర్ణయించింది.

తాజాగా 20 బిలియన్‌ డాలర్ల నిధుల సైనిక విభాగం ఏర్పాటు ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం తెలపాలని యోచిస్తోంది. అలాగే, జపాన్‌ సైనిక వ్యవస్థ పునర్నిర్మాణానికి ప్రోత్సాహం అందించాలని, దక్షిణ కొరియాతో పాటు జపాన్‌కు ఆయుధాలు విక్రయించాలని నిర్ణయించింది. 2022 శీతాకాల ఒలింపిక్స్‌ వేదికను బీజింగ్‌ నుంచి మార్చేలా ప్రయత్నాలు జరపాలని యోచిస్తోంది. తమ దేశంలో చైనా సర్కారు నడుపుతున్న మీడియా సంస్థల్ని నిషేధించాలని నిర్ణయించింది.

Related posts