telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి మంగళవారం లేఖ రాశారు. ఏపీ జెన్ కో థర్మల్ ప్లాంట్ కు ఒడిశాలోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని కేటాయించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. బొగ్గు నిల్వల్లో కనీస వాటాను కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వలేదని ప్రధానికి వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత సింగరేణి కోల్‌ కాలరీస్‌ను తెలంగాణకు కేటాయించారని పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బొగ్గు మీదే ఎక్కువగా ఆధారపడుతున్నామని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అదనపు విద్యుత్ ఉత్పత్తికి ప్రతి ఏటా 7.5 ఎంఎంటీఏలు అవసరమని తెలిపారు. తర రాష్ట్రాల నుంచే వచ్చే బొగ్గు మీదే ఎక్కువగా ఆధారపడుతున్నాం. దీనివల్ల రాష్ట్ర విద్యుత్‌ రంగంలో భరోసా లేకుండా పోయింది. ఇరవై నాలుగు గంటల నిరంతర విద్యుత్‌ సరఫరాకు ఈ పరిస్ధితి తీవ్ర అవరోధంగా మారిందని లేఖలో పేర్కొన్నారు.

Related posts